అక్షరటుడే, హైదరాబాద్: KPHB : కూకట్పల్లి హౌజింగ్ బోర్డు కాలనీ(Kukatpally Housing Board Colony)లోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. పూర్తి పారదర్శక విధానంలో ఈ-యాక్షన్ ప్రక్రియ ద్వారా ఆన్లైన్లో బుధవారం హౌజింగ్ బోర్డు భూములను విక్రయించారు. కేపీహెచ్బీ ఫేజ్ 4 లోని ఫ్లాట్ నెం 1 కు చెందిన ఒక ఎకరం విస్తీర్ణంలోని కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ రూ.65.34 కోట్లు పలికింది.
ఈ స్థలానికి సంబంధించిన వేలం పాటకు మొత్తం 11 బిడ్లు దాఖలయ్యాయి. కాగా, నలుగురు బిడ్డర్లు వేలం పాటలో పాల్గొన్నారని హౌజింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతం (Housing Board Vice Chairman VP Gautam) తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్ అక్కౌంటెన్సీ ఆఫ్ ఇండియా (Institute of Chartered Accountancy of India) సంస్థ వారు ఈ ఎకరా విస్తీర్ణం భూమిని రూ.65.34 కోట్లకు వేలం పాటలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
KPHB : రాజీవ్ స్వగృహ ప్లాట్ల (Rajiv Swagruha plots) ద్వారా 26 కోట్లు
బండ్లగూడ నాగోల్(Bandlaguda Nagole)లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను దరఖాస్తుదారులకు లాటరీ ద్వారా కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.26 కోట్ల మేర ఆదాయం సమకూరింది. మధ్యతరగతి వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా అందుబాటులోని ధరలతో ఈ ప్లాట్లను తక్కువ ధరలతో విక్రయించారు. ఇక్కడి 159 ఫ్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. కాగా 131 ఫ్లాట్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. తద్వారా రూ.26 కోట్ల మేర ఆదాయం వచ్చింది.
#Kukatpally Housing Board (KPHB) Land Sold for ₹65.34 Crore in Record E-Auction#Hyderabad: The #Telangana Housing Board has earned ₹65.34 crore through the sale of a one-acre commercial open plot in Kukatpally Housing Board (#KPHB) Colony. The land, located at Plot No. 1 in… pic.twitter.com/vG5uw6mJtD
— Hyderabad Mail (@Hyderabad_Mail) July 30, 2025