HomeజాతీయంMinister Piyush | తలపై గన్నుపెట్టి ట్రేడ్ డీల్ చేయలేరు.. వాణిజ్య మంత్రి పీయూష్ కీలక...

Minister Piyush | తలపై గన్నుపెట్టి ట్రేడ్ డీల్ చేయలేరు.. వాణిజ్య మంత్రి పీయూష్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో వాణిజ్య చర్చలు జరుగుతున్న క్రమంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తలకు గన్ పెట్టి ట్రేడ్ డీల్ చేసుకోమంటే తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Piyush | అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు తుది దశకు చేరుకుంటున్న వేళ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (Union Commerce Minister Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. షరతులు, గడువులు విధించి తమతో ఒప్పందాలు చేసుకోలేరని స్పష్టం చేశారు.

తలకు గన్ను పెట్టి ట్రేడ్ డీల్ (trade deal) చేసుకోమంటే తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. జర్మనీ (Germany) పర్యటనలో ఉన్న శుక్రవారం జరిగిన బెర్లిన్ డైలాగ్ లో మాట్లాడుతూ.. ఎటువంటి వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయడానికైనా భారతదేశం తొందరపడదన్నారు. వాణిజ్య ఎంపికలను పరిమితం చేసే భాగస్వామ్య దేశాల షరతులను ఇండియా తిరస్కరిస్తుందన్నారు.

Minister Piyush | చురుగ్గా వాణిజ్య చర్చలు..

ప్రపంచ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు చురుగ్గా చర్చలు జరుగుతున్నాయని పీయూష్ గోయల్ చెప్పారు. యూరోపియన్ యూనియన్, అమెరికాతో సహా మిగతా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే, షరతులు, గడువులు పెట్టి తమతో బలవంతంగా ట్రేడ్ డీల్ చేసుకోలేరని స్పష్టం చేశారు. “మేము ఈయూతో చర్చలు జరుపుతున్నాం. అటు అమెరికాతోనూ మాట్లాడుతున్నాము. అయితే, మేము తొందరపడి ఒప్పందాలు చేసుకోము. గడువు విధించి లేదా మా తలపై తుపాకీతో ఒప్పందాలు చేసుకోమంటే చేసుకోమని” ఆయన తేల్చి చెప్పారు.

Minister Piyush | జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట..

ఇండియా ఎప్పుడైనా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే వాణిజ్య ఒప్పందాలు (Trade agreements) చేసుకుంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. భారతదేశం దీర్ఘకాలికంగా న్యాయమైన వాణిజ్య ఒప్పందాన్ని పొందుతోందా అని అడిగినప్పుడు ఈ విధంగా బదులిచ్చారు. “జాతీయ ప్రయోజనాల ఆధారంగా కాకుండా మరే ఇతర పరిగణనల ఆధారంగా భారతదేశం తన వాణిజ్య మిత్రులను ఎప్పుడూ నిర్ణయించలేదని ” గోయల్ అన్నారు. వాణిజ్య ఒప్పందాన్ని దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని పేర్కొన్నారు. భారతదేశం ఎప్పుడూ తొందరపడి లేదా ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోదని అన్నారు.

అధిక సుంకాలను (high tariffs) ఎదుర్కోవడానికి భారతదేశం కొత్త మార్కెట్ల వైపు చూస్తోందని పీయూష్ తెలిపారు. భారతదేశం దీర్ఘకాలిక, షరతులతో కూడిన న్యాయమైన వాణిజ్య ఒప్పందాన్ని పొందుతోందా అన్న ప్రశ్నకు గోయల్ బదులిస్తూ.. “జాతీయ ప్రయోజనం కాకుండా మరే ఇతర అంశాల ఆధారంగా ఇండియా తన స్నేహితులు ఎవరు అని ఎప్పుడూ నిర్ణయించలేదు.

ఈయూతో స్నేహం చేయలేరని ఎవరో చెప్తారు. నేను అందుకు అంగీకరించను. కెన్యాతో (Kenya) కలిసి పని చేయొద్దని ఇంకెవరో చెబుతారు. అది మాకు ఆమోదయోగ్యం కాదని’ పేర్కొన్నారు. ఒక దేశం నుంచి ఒక నిర్దిష్ట ఉత్పత్తిని కొనుగోలు చేయాలనే నిర్ణయం మొత్తం ప్రపంచం నిర్ణయం తీసుకోవాల్సిన విషయమని అన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేయాలని అమెరికా భారతదేశంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.