HomeతెలంగాణTelangana Politics | బీజేపీ, బీఆర్ఎస్ ఒక్క‌టేనా?.. ఒకేలైన్‌లో క‌విత‌, రాజాసింగ్ వ్యాఖ్య‌లు

Telangana Politics | బీజేపీ, బీఆర్ఎస్ ఒక్క‌టేనా?.. ఒకేలైన్‌లో క‌విత‌, రాజాసింగ్ వ్యాఖ్య‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Politics | రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ (BJP and BRS) మ‌ధ్య పోటీ కేవ‌లం నాట‌క‌మేనా? రెండు పార్టీలు అంత‌ర్గ‌తంగా క‌లిసే ప‌ని చేస్తున్నాయా? ఎప్ప‌టికైనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావాల్సిందేనా? కేసీఆర్‌, కేటీఆర్ (KCR and KTR) వేస్తున్న అడుగులు అటు వైపేనా? ఇన్నాళ్లు ప్ర‌తి ఒక్క‌రినీ మ‌దిని తొలిచిన ఈ ప్ర‌శ్న‌ల‌కు రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు స‌మాధాన‌మిస్తున్నాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BRS MLC Kavita and BJP MLA Rajasingh) తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఈ సందేహాల‌కు మ‌రింత బ‌లం చేకూర్చుతున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్‌ను గంప‌గుత్త‌గా క‌లిపే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని క‌విత వ్యాఖ్యానించ‌డం, రెండు పార్టీలు అంత‌ర్గ‌తంగా క‌లిసే ప‌ని చేస్తాయ‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్ప‌డం ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో (state politics) సంచ‌ల‌నంగా మారాయి.

బీజేపీ, బీఆర్ఎస్ బంధంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) మొద‌టి నుంచి అనుమానాలు వ్య‌క్తం చేస్తూనే ఉంది. రెండు పార్టీలు ర‌హ‌స్యంగా క‌లిసే ప‌ని చేస్తూ, బ‌య‌ట మాత్రం వేర్వేరు అన్న‌ట్లు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని, కానీ రెండూ ఒక్క‌టేన‌ని ప్ర‌చారం చేస్తూ వ‌చ్చింది. అసెంబ్లీ ఎన్నిక‌ల (assembly elections) ముందు నుంచి కాంగ్రెస్ ఈ అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. కానీ జ‌నం పెద్ద‌గా న‌మ్మ‌లేదు. కానీ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. కాంగ్రెస్ ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూర్చుతున్నాయి.

Telangana Politics | ర‌హ‌స్య మిత్రులు నిజ‌మేనా?

తెలంగాణ (Telangana) వ‌చ్చిన త‌ర్వాత బీజేపీ, బీఆర్ఎస్ (BJP and BRS) మ‌ధ్య గ‌తంలో పొత్తులు కానీ, ఇత‌ర సంబంధాలు కానీ లేవు. కేసీఆర్ (KCR) ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత మొద‌టి ఐదేళ్ల పాటు బీజేపీతో స‌ఖ్య‌త‌గానే ఉన్నారు. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు, బిల్లుల విష‌యంలో కేంద్రానికి మ‌ద్ద‌తుగా నిలిచారు. రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం బీజేపీకి (BJP) వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తారు.

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ గా (TRS into BRS) మార్చాక జాతీయ స్థాయిలో ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల (assembly elections) త‌ర్వాత ఓడిపోవ‌డంతో గులాబీ శ్రేణులు డీలా ప‌డ్డాయి. మ‌రోవైపు, అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ అక్ర‌మాల‌పై దృష్టి సారించింది. దేశ వ్యాప్తంగం సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఫార్ములా ఈ రేస్ (Formula E race) వ్య‌వ‌హారం, కాళేశ్వ‌రంలో అక్ర‌మాలు వంటి వాటిపై విచార‌ణ‌కు ఆదేశించింది. దీంతో స‌హ‌జంగానే బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళ‌న నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే పార్టీ ముఖ్యులు కేంద్రంతో స‌ఖ్య‌త కుదుర్చుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Telangana Politics | మోదీ శ‌ర‌ణుగోరి..

అధికారం కోల్పోయిన త‌ర్వాత బీఆర్ఎస్ (BRS) అనేక ఇబ్బందుల్లో ప‌డింద‌న్నది వాస్త‌వం. కాళేశ్వ‌రంలో (Kaleshwaram) జ‌రిగిన అక్ర‌మాల‌పై క‌మిష‌న్ లోతుగా విచారిస్తోంది. ఇప్ప‌టికే అనేక మందిని విచారించిన ఘోష్ క‌మిష‌న్‌.. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను (BRS chief KCR) కూడా విచారించాల‌ని నిర్న‌యించింది. జూన్ 5న విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు జారీ చేసింది.

మ‌రోవైపు, ఫార్ములా ఈ రేస్ కారు వ్య‌వ‌హారంలో (Formula E race car case) కేటీఆర్ పీక‌ల్లోతుల్లో కూరుకుపోయారు. ఇక‌, ఫోన్ ట్యాపింగ్ విచార‌ణ కూడా బీఆర్ఎస్‌కు చుట్టుకుంటోంది. అప్ప‌టి ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్‌కు (phone tapping) పాల్ప‌డిన అధికారులు ఇప్ప‌టికే ఊచ‌లు లెక్క‌బెడుతున్నారు. ఈ విచార‌ణ కూడా త్వ‌ర‌లోనే కొలిక్కి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అప్ప‌టి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను ఇందులో విచారించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇలా ఒక‌దాని వెంట ఒక‌టి కేసులు వెంటాడుతుండ‌డంతో బీఆర్ఎస్ అంత‌ర్మ‌ధ‌నంలో ప‌డిపోయింది.

మ‌రోవైపు, లిక్క‌ర్ కేసులో (liquor case) సొంత బిడ్డ క‌విత అరెస్టు కావ‌డం, ఈడీ (ED) దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో డిఫెన్స్‌లో ప‌డిపోయిన కేసీఆర్‌.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మోదీ శ‌ర‌ణు కోరార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్ని విధాలుగా స‌హ‌కరిస్తామ‌ని చెప్ప‌డంతో కేంద్రం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించింద‌ని, అందువ‌ల్లే క‌విత‌కు బెయిల్ (Kavita bail) వ‌చ్చింద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. లిక్క‌ర్ స్కామ్ (liquor scam) త‌ర్వాతే కేసీఆర్ మోదీకి స‌రెండ‌ర్ అయ్యార‌ని, అందుకే మొన్న‌టి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో (Lok Sabha elections) బీజేపీకి స‌హ‌క‌రించార‌ని, అలాగే, హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీకి (Hyderabad Local Bodies MLC) పోటీ కూడా పెట్ట‌లేద‌ని కాంగ్రెస్ నేత‌లు గుర్తు చేస్తున్నారు.

Telangana Politics | క‌విత‌, రాజ‌సింగ్ చెబుతున్న‌ద‌దే..

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు కాంగ్రెస్ ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూర్చుతున్నాయి. రెండు పార్టీలు ఒక్క‌టేన‌ని రాజాసింగ్ (Rajasingh) సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. గ‌తంలో అంత‌ర్గ‌తంగా క‌లిసి ప‌ని చేయ‌డం వ‌ల్లే బీజేపీ (BJP) న‌ష్ట‌పోయింద‌ని, లేక‌పోతే ఇప్ప‌టికే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేద‌ని చెప్పారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్లు (బీజేపీ) కూడా ఎప్పుడో బీజేపీని బీఆర్‌ఎస్‌లో కలిపేసేవారంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంత‌కు ముందే క‌విత (Kavita) కూడా అదే లైన్‌లో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని (BRS Party) గంప‌గుత్త‌గా అప్ప‌గించే కుట్ర జ‌రుగుతోంద‌ని క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జైలులో ఉన్న‌ప్పుడే ఈ ప్ర‌తిపాద‌న వ‌స్తే తాను వ్య‌తిరేకించాన‌ని చెప్పారు. బీఆర్ఎస్‌లో విలీనం కాకుండా స్వ‌తంత్రంగా ఉండాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌న్నారు. మొత్తంగా క‌విత‌, రాజాసింగ్ (Kavita and Raja Singh) వ్యాఖ్య‌లు బీజేపీ, బీఆర్ఎస్ అంత‌ర్గ‌త చెలిమిని వెల్ల‌డిస్తున్నాయి.