ePaper
More
    HomeసినిమాComedian Ali | బూతుప‌దంతో రాజేంద్ర ప్ర‌సాద్ త‌న‌ని తిట్టడంపై అలీ ఆస‌క్తిక‌ర కామెంట్స్.. వీడియో...

    Comedian Ali | బూతుప‌దంతో రాజేంద్ర ప్ర‌సాద్ త‌న‌ని తిట్టడంపై అలీ ఆస‌క్తిక‌ర కామెంట్స్.. వీడియో వైర‌ల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Comedian Ali | న‌ట‌కిరీటి రాజేంద్ర ప్రసాద్(Rajendra prasad) ఈ మ‌ధ్య వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూ లలో త‌ప్పుగా మాట్లాడుతూ తర్వాత సైలెంట్​గా సారీ చెప్పేయడం పరిపాటిగా మారింది. గతంలో డేవిడ్ వార్నర్(David Warner)ను బూతులు మాట్లాడి చిక్కుల్లో పడ్డారు. ఆ త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇక ఇప్పుడు క‌మెడియన్ అలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే ఈ సారి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుండా త‌న‌ని త‌ప్పుగా అర్ధం చేసుకుంటే మీ ఖ‌ర్మ అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    Comedian Ali | కావాల‌ని అన్న‌ది కాదు..

    తాను ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తినని రాజేంద్ర ప్రసాద్​ స్పష్టం చేశారు. ‘‘కొన్ని కార్యక్రమాల్లో నేను మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం మీ ఖర్మ. నేనైతే ఇలానే ఎప్పుడూ సరదాగానే ఉంటాను. మీడియాను నా కుటుంబంగా భావిస్తాను. నన్ను మీరంతా అన్నయ్య అని పిలవడం నా అదృష్టం” అని ఆయన తెలిపారు. ఇక రాజేంద్రప్రసాద్ బూతులపై అలీ (Comedian ali) ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆయన కావాలని అలా మాట్లాడలేదని, అనుకోకుండా మాట తూలిందని తెలిపారు.

    ఆయన కుమార్తె మరణంతో పుట్టెడు బాధలో ఉన్నారని అలీ అన్నారు. ఎస్‍వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు(SV Krishna Reddy birthday) సందర్భంగా నిర్వహించిన ఈవెంట్​లో అనుకోకుండా రాజేంద్రప్రసాద్​కు మాట తూలింది. సరదాగా అన్న మాటలను మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్. పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన కూతురు పోయింది. అమ్మలాంటి బిడ్డ చనిపోవడంతో అలా అయ్యారు. ఆయన కావాలని చెప్పింది కాదు. ఆయన పెద్దాయన. ప్లీజ్.. ఎవరూ దీన్ని పెద్దది చేయకండి” అని అలీ చెప్పుకొచ్చారు. కాగా రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (Gayatri) గతేడాది (2024 అక్టోబర్ 5న) మరణించిన విష‌యం విదిత‌మే.

    More like this

    Minister Nitin Gadkari | డబ్బులిచ్చి నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు.. పెట్రోల్ లాబీపై కేంద్ర మంత్రి గడ్కరీ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Nitin Gadkari | కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి...

    Banswada | సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్​...

    Yellareddy | ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ప్రేమికుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు (Yellareddy Police)...