అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | భారత్‌లో విస్తరణ ప్రణాళికల్లో ఉన్న ఓపెన్ ఏఐ తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించాలని మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) కోరారు. ఈ మేరకు ఆయన చాట్ జీపీటీ సృష్టికర్త.. ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు.
ఈ ఏడాది చివర్లో ఇండియాలో తమ మొదటి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు శామ్ అల్ట్‌మన్(Sam Altman) ప్రకటించారు. ఇందుకోసం వచ్చే నెలలో భారత్‌కు రానున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేటీఆర్ ఓపెన్ ఏఐ కార్యకలాపాలకు కేంద్రంగా హైదరాబాద్(Hyderabad)ను ఎంచుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ఇండియాకు హైదరాబాద్ గేట్ వేగా మారిందని, ఓపెన్ ఏఐ లాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రంగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని. ఇక్కడ టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, తెలంగాణ(Telangana) స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వంటి సంస్థలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ వాతావరణం ఓపెన్ ఏఐ కార్యకలాపాలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
KTR | వచ్చే నెల ఇండియాకు..
కృత్రిమ మేధలో సంచలనం సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ(AI Company) భారత్‌లో విస్తృత కార్యలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక్కడ ఉన్న భారీ అవకాశాల నేపథ్యంలో భారత్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించిన ఓపెన్ ఏఐ సీఈవో శామ్.. ఇందుకోసం సెప్టెంబర్‌లో భారత్‌కి రానున్నట్లు ప్రకటించారు. ఇండియాలో కృత్రిమ మేధస్సు వాడకం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. గత సంవత్సరం నుంచి చాట్‌జీపీటీ వినియోగదారుల సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి మరింత ఉత్సాహంగా ఉన్నట్లు శామ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆఫీసు ప్రారంభించాలని కేటీఆర్ శామ్‌ను కోరారు.