అక్షరటుడే, వెబ్‌డెస్క్: colombia plane crash | దేశాన్ని కుదిపేసిన మహారాష్ట్ర చార్టర్డ్ విమాన ప్రమాదం Aeroplane మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. రీసెంట్గా జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఆ ఘటన జరిగి కొద్ది రోజులు కూడా గడవకముందే, కొలంబియాలో జరిగిన మరో విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొలంబియాలోని నార్తె డె సంటాన్‌డెర్ ప్రావిన్స్‌లో ప్రయాణిస్తున్న ఓ చార్టర్డ్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
colombia plane crash | సరిహద్దు ప్రాంతంలో..
అంతేకాదు, ఈ విమానంలో ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలు క్విన్టెరో, సాలకెడో కూడా ప్రయాణిస్తుండటంతో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు విమానం అకస్మాత్తుగా రాడార్ నుంచి అదృశ్యమైనట్లు సమాచారం. గమ్యస్థానానికి చేరుకునేలోపే కొలంబియా–వెనిజులా Venezuela సరిహద్దు ప్రాంతంలో ఈ విమానం కూలిపోయినట్టు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.
సరిహద్దు ప్రాంతం కావడంతో పాటు దట్టమైన అడవులు Forests ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని శిథిలాలను పరిశీలిస్తున్నాయి.
ఈ విమానంలో ఇద్దరు కీలక రాజకీయ నేతలు ఉండటంతో, ప్రమాదం వెనుక సాంకేతిక లోపమా? లేక ఇంకేదైనా కారణాలున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాడార్ నుంచి అకస్మాత్తుగా విమానం మాయమవడం అనేక సందేహాలకు తావిస్తోంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలేనని, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మాత్రమే అసలు కారణాలు వెల్లడిస్తామని కొలంబియా Colombia అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదం, ఇప్పుడు కొలంబియాలో చోటుచేసుకున్న ఈ ఘటనలు వరుసగా జరగడం విమాన భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తిస్తోంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో చార్టర్డ్ విమానాల భద్రత, నిర్వహణ ప్రమాణాలపై మరింత కఠినమైన చర్యలు అవసరమన్న అభిప్రాయం బలపడుతోంది.