అక్షరటుడే, ఇందూరు: Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు కళాశాలలను నిరవధికంగా బంద్ చేపడతామని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల (Telangana University private colleges) యాజమాన్యం అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి, నరాల సుధాకర్ (Narala Sudhakar) తెలిపారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో (Deputy CM Bhatti Vikramarka) చర్చలకు శుక్రవారం ఆహ్వానించారన్నారు.
చర్చల అనంతరం తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇప్పటికే కళాశాలల నిర్వహణ అతి కష్టంగా మారిందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గత మూడేళ్లుగా రీయింబర్స్మెంట్ విడుదల చేయకున్నా.. పాఠాలు బోధించామని తెలిపారు. కనీసం ఇప్పటికైనా విడుదల చేయాలన్నారు. ఇప్పటికే యూనివర్సిటీ పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని రిజిస్ట్రార్ యాదగిరికి వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.
