ePaper
More
    HomeతెలంగాణFee reimbursement | ఈ నెల 15 నుంచి కాలేజీలు బంద్ చేస్తాం.. యాజమాన్యాల కీలక...

    Fee reimbursement | ఈ నెల 15 నుంచి కాలేజీలు బంద్ చేస్తాం.. యాజమాన్యాల కీలక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fee reimbursement | రాష్ట్రంలోని ప్రైవేట్​ కాలేజీ (Private Colleges)లకు కొంతకాలంగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్​ చెల్లించడం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోయాయి.

    రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్​షిప్​ (Scholarship), రీయింబర్స్​మెంట్​ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. బకాయిలు చెల్లించకోపోతే ఈ నెల 15 నుంచి కాలేజీలను బంద్​ చేస్తామని ప్రకటించాయి.

    Fee reimbursement | రూ.10 వేల కోట్ల బకాయిలు

    రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రావాల్సి ఉందని కాలేజీలు తెలిపాయి. వాటిని చెల్లించపోతే నిరవదికంగా కాలేజీలను మూసి వేస్తామని హెచ్చరించాయి. ఈ నెల 15న ఇంజినీర్స్​ డే (Engineers’ Day) బ్లాక్ డేగా నిర్వహిస్తామని కాలేజీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కలిసి ప్రైవేట్​ కాలేజీ యాజమాన్యాలు నోటీసులు అందించారు.

    Fee reimbursement | జీతాలు చెల్లించలేని దుస్థితి

    ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కాలేజీల యాజమాన్యాలు తెలిపాయి. సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నాయి. కాలేజీల నిర్వాహణ, ఉద్యోగుల జీతాభత్యాల కోసం అప్పులు చేయాల్సి పలు కాలేజీల యజమానులు వాపోయారు. మరోవైపు స్కాలర్​షిప్​, రీయింబర్స్​మెంట్​ నిధులు రాకపోవడవంతో విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్​మెంట్​ రాలేదని కాలేజీలు చదువు పూర్తయినా.. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మొత్తం ఫీజు కడితనే ఇస్తామని చెబుతున్నాయి.

    More like this

    National Lok Adalat | రేపు జాతీయ లోక్ అదాలత్

    అక్షరటుడే, కామారెడ్డి: National Lok Adalat | పెండింగ్​లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం శనివారం జిల్లాలోని...

    Lingampet | వరద ముంపునకు గురైన పొలాల్లో ఇసుక తొలగింపు

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) రైతుల పొలాల్లో ఇసుకమేటలు వేశాయి....

    Gandhari Mandal | మూగజీవాలకు చికిత్స అందేనా..!

    అక్షర టుడే, గాంధారి: Gandhari Mandal | మండలంలోని గుర్జాల్‌తండాలో (Gurjalthanda) మూగజీవాలకు పూర్తిస్థాయిలో చికిత్స అందడం లేదు....