అక్షరటుడే, ఆర్మూర్: SFI Armoor | పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ నియోజకవర్గంలో (Armoor constituency) తలపెట్టిన బంద్ విజయవంతమైందని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలను (engineering and degree colleges) బంద్ చేయించారు.
అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ (fee reimbursements) రాకపోవడంతో కళాశాలల్లో విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదన్నారు. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నాయని.. ప్రభుత్వం ఇలా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. విద్యార్థుల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుచేసి యాజమాన్యాలకు ఫీజులు కట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని యాజమాన్యాలు అడిగితే వారిపై ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేయిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షుడు జీషణ్, నాగేంద్ర, నిరంజన్, శ్రీనివాస్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

