Homeజిల్లాలుకామారెడ్డిCollector Ashish Sangwan | విద్యార్థినులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం

Collector Ashish Sangwan | విద్యార్థినులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Collector Ashish Sangwan | మండలంలోని కొయ్యగుట్ట (Koyyagutta) సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను (Social Welfare Girls’ Gurukul School) కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వసతి గృహం గదులు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థినులు చదువుతో పాటు ఇతర సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి, ఉపాధ్యాయులు ఉన్నారు.