అక్షరటుడే, కామారెడ్డి : Kamereddy | కామారెడ్డి కలెక్టరేట్ (Kamareddy Collectorate) స్వాతంత్ర దినోత్సవానికి ముస్తాబైంది. మువ్వన్నెల వెలుగులలో సమీకృత కార్యాలయం జిగేల్ మంటోంది. పంద్రాగస్టు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి మూడు రంగుల విద్యుత్ కాంతులను ఏర్పాటు చేశారు. దాంతో కలెక్టరేట్ కార్యాలయం ఆకట్టుకుంటుంది.
Kamereddy | ముఖ్య అతిథిగా కోదండ రెడ్డి
జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ (Indira Gandhi) స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 9:30 గంటలకు స్టేడియంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్కక్రమాలు నిర్వహించనున్నారు. అయితే వర్షం పడితే వేడుకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
