Homeజిల్లాలుఆదిలాబాద్Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు 11) సాయంత్రం కుంభవృష్టి కురిసింది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

జిల్లా కేంద్రంలోని పాత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం ఒక్కసారిగా కుప్ప‌కూలిపోయింది. ఈ భవనంలో పలు శాఖలు ఉన్నాయి. ఖజానా శాఖ Treasury Department కార్యాలయం కూడా ఇందులో ఉంది.

Collectorate building collapses : తప్పిన ప్రమాదం..

కాగా, వర్షం ధాటికి ఈ కార్యాలయంలోని పైకప్పు ఒక్కసారిగా విరిగిపడింది. ఖజానా శాఖ కార్యాలయం ఎదుట విధులు నిర్వహిస్తున్న పోలీసులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ట్రజరీ కార్యాలయం ఆవరణలోని ర్యాకులపై పైకప్పు పడింది. దీంతో ర్యాకుల్లోని దస్త్రాలు కొలాప్స్ అయ్యాయి. కార్యాలయం అంతా చిందరవందరగా మారింది.

ఆదిలాబాద్​ ఇన్​ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు Minister Jupally Krishna Rao జిల్లా పర్యటనలో ఉన్నారు. కాగా, కలెక్టరేట్​లో అధికారులతో జరిగే సమావేశానికి వచ్చే సమయానికి ముందే ఈ ప్రమాద ఘటన జరిగింది.

సాయంత్రం కావడంతో కార్యాలయ సిబ్బంది అప్పుడే బయటకు వెళ్లిపోయారు. అంతా వెళ్లిపోయాక ప్రమాదం జరగడంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.