Homeజిల్లాలుకామారెడ్డిCollector Rajiv Gandhi Hanumanthu | రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్​

Collector Rajiv Gandhi Hanumanthu | రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్​

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Collector Rajiv Gandhi Hanumanthu | నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి, ఖానాపూర్ (Khanapur), సారంగాపూర్ (Sarangapur) ప్రాంతాల్లోని రైస్​మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం, మిల్లింగ్​ (Milling) అయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బియ్యాన్ని భద్రపరిచే విధానాన్ని పరిశీలించారు. ముందస్తుగానే ఋతుపవనాల (Monsoon) ప్రవేశంతో వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు.


ఇప్పటికే 90 శాతానికి పైగా ధాన్యం సేకరణ పూర్తయిందని, చివరి దశలో మిగిలిన ధాన్యం నిల్వలను కూడా దిగుమతి చేసుకొని మిల్లింగ్ చేయాలని పేర్కొన్నారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్​వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.