అక్షరటుడే, గాంధారి: Panchayat election | రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా గాంధారి మండలంలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పరిశీలించారు. ఆర్డోవో పార్థసింహారెడ్డి, అదనపు కలెక్టర్ చందర్, తహశీల్దార్ రేణుక చావన్, ఎంపీడీవో రాజేశ్వర్లతో మాట్లాడారు.
ఎన్నికల ఓటింగ్ (election voting) శాతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. 11 గంటల వరకు 51 శాతం పోలింగ్ పూర్తయిందని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులు, పోలీసులకు సూచింంచారు.
Panchayat election | వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన కలెక్టర్
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తుండగా.. అక్కడే 95 సంవత్సరాల వృద్ధురాలు ఓటు వేసేందుకు వచ్చింది. దీంతో కలెక్టర్ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించారు. పేరు, వార్డు నంబర్ అడిగి తెలుసుకున్నారు. ఆమె యోగక్షేమాలను అడిగారు. వృద్ధులకు వీల్ చైర్లు (wheelchairs) అందుబాటులో ఉంచాలని, ఇందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.