HomeతెలంగాణNizamabad Collector | ముంపు గ్రామాలను సందర్శించిన కలెక్టర్

Nizamabad Collector | ముంపు గ్రామాలను సందర్శించిన కలెక్టర్

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Nizamabad Collector | ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి భారీగా వరద వస్తోంది. దీంతో మండలంలోని హంగార్గ గ్రామంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్(SRSP Backwater) చేరుకుంది. వరద ముంచెత్తడంతో గ్రామంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గ్రామంలోకి వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎస్డీఆర్​ఎఫ్​ బృందాలు(SDRF Teams) ఇప్పటికే హంగార్గా గ్రామానికి చేరుకున్నాయి. అక్కడి పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు.

అదేవిధంగా సాలురా మండలం(Salura Mandal) హున్సా, మందర్న గ్రామాల్లో(Mandarna Village) వరద చేరుకోవడంతో ఆ గ్రామాల ప్రజలను సాలూరాలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ గ్రామాలను కూడా కలెక్టర్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆయా గ్రామాలలో ఎస్డీఆర్​ఎఫ్​ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు.

వరద ఉధృతి తగ్గుతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. కలెక్టర్​తో పాటు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహశీల్దార్​ విఠల్​, శశిభూషణ్​ తదితరులు పాల్గొన్నారు.