అక్షరటుడే, ఆర్మూర్: Panchayat elections | గ్రామ పంచాయతీ (Gram Panchayat elections) మూడో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అలూర్, ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తనిఖీ చేశారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ తీరుతెన్నులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీవో, ఓపీవోలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు.
Panchayat elections | గందరగోళానికి గురికావొద్దు..
ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. చెక్‌లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల (polling stations) వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను ఆయన పరిశీలించారు.
Panchayat elections | బందోబస్తు మధ్య సామగ్రి తరలించాలి
పోలింగ్ సామగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్వోలకు సూచించారు. కాగా.. ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ కలెక్టర్‌తో కలిసి ఆలూర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించారు. అలాగే నందిపేట, డొంకేశ్వర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సైతం సందర్శించి పోలింగ్ సామగ్రి పంపిణీ తీరును పరిశీలించారు. వీరి వెంట స్థానిక అధికారులు ఉన్నారు.