అక్షరటుడే, ఇందూరు: Collector Vinay Krishna Reddy | నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌ను శనివారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
Collector Vinay Krishna Reddy | పోలింగ్ సామగ్రి..
స్ట్రాంగ్ రూమ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు పంపుతున్న పోలింగ్ సామగ్రి గురించి అడిగి తెలుసుకున్నారు. సామగ్రి తరలింపు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో సాయాగౌడ్ ఉన్నారు.
