అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad Collector | నిజామాబాద్ కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మిని (Nizamabad District Judge) మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని (District Court) జిల్లా జడ్జి ఛాంబర్లో సోమవారం ఆమెకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లా స్థితిగతులపై, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(District Legal Services Authority) ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు.