Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | గణేష్‌ నిమజ్జన రూట్‌మ్యాప్‌ పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Kamareddy | గణేష్‌ నిమజ్జన రూట్‌మ్యాప్‌ పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలో గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర (ganesh Nimajjana Shobayatra) రూట్‌మ్యాప్‌ను కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఎస్పీ రాజేశ్‌చంద్ర (SP Rajesh Chandra) సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వినాయక విగ్రహాల ప్రతిష్ట, నిమజ్జనోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ధర్మశాల (Dharmashala), సుభాష్‌ రోడ్, పాంచ్‌ రాస్తా, పెద్ద బజార్, రైల్వే కమాన్, కొత్త బస్టాండ్‌ నుంచి టేక్రియాల్‌ చెరువు వరకు రూట్‌మ్యాప్‌ పరిశీలించారు.

భద్రత, సౌకర్యాల ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వారి వెంట అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌ రెడ్డి, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్, ఇతర శాఖల సిబ్బంది, గణేష్‌ ఉత్సవ కమిటీల ప్రతినిధులు ఉన్నారు.

Must Read
Related News