అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) పాల్గొంటున్న ఉద్యోగులకు ఎన్నికల విధులపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు 17వ తేదీ మూడోవిడత పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ముప్కాల్‌లోని రైతువేదికలో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి సందేహాలు ఉన్నా ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు.
Collector Nizamabad | పీవోలకు కీలక సూచనలు..
శిక్షణ తరగతులు సందర్శించిన సందర్భంగా కలెక్టర్ పీవోలకు కీలక సూచనలు చేశారు. హ్యాండ్‌బుక్‌లో పొందుపర్చిన అంశాలను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధులపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా పోలింగ్ కౌంటింగ్ (Polling Counting) ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని అన్నారు.
Collector Nizamabad | విధివిధానాలపై అవగాహన
పీవోలు చేపట్టాల్సిన చర్యలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. తప్పులు జరిగితే క్రమ శిక్షణ చర్యలకు గురికావాల్సి ఉంటుందన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలని సూచించారు. సమయ పాలన పక్కాగా పాటించాలని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ మెటీరియల్ తీసుకునే సమయంలో జాగ్రత్తగా పరిశీలించుకోవాలని పేర్కొన్నారు.
Collector Nizamabad | 18 రకాల కార్డులతో ఓటు వేయవచ్చు..
పోలింగ్ స్టేషన్ వద్ద బీఎల్వోలకు సహాయక కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ (Election Commission) నిర్దేశించిన 18 రకాల ఐడీ కార్డులలో ఏదైనా ఒక దానిని ఓటరు తీసుకురావచ్చని తెలిపారు. ఈ విషయంపై విస్తృతస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్వోలకు మినహా మిగతా ఎవరికి కూడా పోలింగ్ కేంద్రాల్లో (Polling Centers) సెల్‌ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అంధులు ఓటు వేసే సందర్భంగా పీవో, ఓపీవోలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లకూడదని, సహాయకులుగా వచ్చిన వారికి కుడిచేతి మధ్య వేలుకు సిరా చుక్క వేయాలన్నారు. రిపోలింగ్‌కు ఆస్కారం లేకుండా, ప్రశాంత వాతావరణంలో సజావుగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు పూర్తయ్యేలా జాగ్రత్తగా ఎన్నికలు జరపాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ తరగతులలో ఆర్వోలు, పీవోలు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.