అక్షరటుడే, ఇందూరు : Municipal Corporation | నిజామాబాద్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం కార్పొరేషన్ కార్యాలయం(Corporation Office)లో సమావేశం నిర్వహించారు.
నూతన భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ, అక్రమ కట్టడాలపై చేపట్టిన చర్యలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఫైళ్లను తనిఖీ చేసి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్(LRS) రుసుము చెల్లించిన వారికి తొందరగా క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు కమిషనర్ రవిబాబు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
Municipal Corporation | కార్పొరేషన్ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ దాడులు..
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ దాడులు జరిగాయి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒకరు రూ.7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. దీంతో కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతిపై సర్వత్రా చర్చ జరిగింది. దీంతో కలెక్టర్(Collector Vinay Krishna Reddy) సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది.