అక్షరటుడే, ఇందూరు: Ganesh immersion | వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) శనివారం ఆయా ప్రాంతాలను సందర్శిస్తూ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆర్మూర్‌లోని గుండ్ల చెరువు (Gundla Cheruvu), నందిపేట (nandipet) మండలం ఉమ్మెడ (Ummeda), నవీపేట (navipet) మండలం యంచ (Yancha) గోదావరి (Godavari) వంతెన తదితర ప్రాంతాలను సందర్శించారు. ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు. నిమజ్జనం ప్రదేశాల్లో ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలు, గజ ఈతగాళ్లు, పడవలు, మెడికల్ బృందం క్రేన్ లైటింగ్ సదుపాయాలను ఆయన పరిశీలించారు.
Ganesh immersion | ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
నిమజ్జనోత్సవాన్ని ఆనందోత్సాహాల నడుమ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. శోభాయాత్రను కలెక్టరేట్‌తో పాటు సీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తామని ఆయన వెల్లడించారు.