అక్షరటుడే, వర్ని: Collector Nizamabad | వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌ను (Siddapur Reservoir) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు. కాలినడక వెళ్లి పరిశీలించారు. నిజాంసాగర్ (Nizamsagar) నాన్-కమాండ్ ఏరియా పరిధిలోని సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాలకు నీటిని అందించేందుకు ఈ రిజర్వాయర్ నిర్మాణం కీలకం కావడంతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు.
Collector Nizamabad | దారి లేకపోవడంతో..
రిజర్వాయర్ కట్ట నిర్మాణానికి సరిహద్దు ప్రాంతాలను నిర్ధారించేందుకు రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (Survey and Land Records) శాఖల అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించే క్రమంలో వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కాలినడకన వాగులు, కొండలు దాటుతూ రిజర్వాయర్ కట్ట నిర్మిస్తున్న ప్రాంతానికి కలెక్టర్ చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఫారెస్ట్ గెజిట్ నోటిఫికేషన్లో పొందుపర్చిన అటవీ సరిహద్దును పరిశీలించారు.
Collector Nizamabad | స్థల వివాదంపై చర్చలు..
రిజర్వాయర్‌కు సంబంధించి స్థల వివాదాలపై బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ తదితరులతో కలెక్టర్ చర్చించారు. హద్దులను కచ్చితంగా నిర్ధారించి పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూమి అవసరమైతే.. భూసేకరణ, అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్ సాయిలు అధికారులు ఉన్నారు.

