Homeజిల్లాలునిజామాబాద్​Banswada | పాఠశాలలు, ఏటీసీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

Banswada | పాఠశాలలు, ఏటీసీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

బాన్సువాడలో ప్రభుత్వ పాఠశాలలలు, ఏటీసీ సెంటర్లను కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి అధికారులతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ప్రభుత్వ పాఠశాలలు, ఐటీఐలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి (Collector T. Vinay Krishna Reddy) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చందూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.

ముఖ గుర్తింపు విధానం ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు (teachers and students) హాజరు నమోదు చేస్తున్నారా అని పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను చూశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు.

డైనింగ్ హాల్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయాన్ని గమనించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారులకు ఫోన్​లో ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ఐటీఐ నిర్వాహకులు పాల్గొన్నారు.