అక్షరటుడే, బోధన్: Nizamabad Collector | సాలూరు మండల తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను పరిశీలించారు.
తహశీల్దార్ కార్యాలయ (Tahsildar office) పరిధిలో జరుగుతున్న రెవెన్యూ పనులు.. వాటికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భూభారతి దరఖాస్తుల (land registration applications) పరిష్కార సరళిని ఆయన పరిశీలించారు.
భూభారతి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి క్లియర్ చేయాలని పెండింగ్లో పెట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ రికార్డులను సక్రమంగా భద్రపర్చుకోవాలని సూచించారు. ఆయన వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), తహశీల్దార్ శశిభూషణ్ తదితరులున్నారు.