అక్షరటుడే, ఇందూరు : Postal Ballot Process Inspection | ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టరేట్లో (District Collectorate) ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ సెంటర్‌ను ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పరిశీలించారు.
Postal Ballot Process Inspection | పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఆరా..
ఈ సందర్భంగా ఎంతమంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకుని ఓటు వేశారని కలెక్టర్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగిసిన వెంటనే కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ హాలుకు వాటిని తరలించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులున్నారు.