అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ( Collector Vinay Krishna Reddy), రాష్ట్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవో హరి సింగ్‌తో కలిసి సోమవారం పరిశీలించారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల (political parties) ప్రతినిధుల సమక్షంలో గౌడౌన్ సీల్‌ను తెరిచారు. బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని, భద్రపరచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్.. నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఈవీఎం నోడల్ అధికారి ప్రసాద్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, జితేందర్ తదితరులున్నారు.