Collector
Collector Rajiv Gandhi Hanumanthu | ఈవీఎం గోడౌన్​ను పరిశీలించిన కలెక్టర్​

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్​లో ఈవీఎం గోడౌన్(EVM Godown)​ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్​(Godown seal)ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు ఎన్నికల సామగ్రి భద్రపర్చిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్(Additional Collector Kiran Kumar), ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులున్నారు.