189
అక్షరటుడే, ఇందూరు: Collector Ila Tripathi| నిజామాబాద్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సోమవారం జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి (Judge GVN Bharatalakshmi), పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలను (CP Sai Chaitanya) మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లా కోర్టులోని జడ్జి ఛాంబర్లో న్యాయమూర్తిని కలిసి పూలమొక్కను అందించారు. జిల్లా స్థితిగతులపై, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై వారు చర్చించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీని కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. జిల్లాలో పరిస్థితులపై చర్చించారు.