అక్షరటుడే, ఇందూరు : Collector Ila Tripathi | నిజామాబాద్ (Nizamabad) జిల్లా కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మధ్యాహ్నం 2.40 గంటలకు కలెక్టరేట్‌కు ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను అదనపు కలెక్టర్లు అంకిత్ (Additional Collectors Ankit), కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా సాదరంగా స్వాగతం పలికారు.
Collector Ila Tripathi | అధికారుల పరిచయం..
ఐఏఎస్ ఇలా త్రిపాఠి నేరుగా తన ఛాంబర్‌కు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను పలు శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి పరిచయం చేసుకున్నారు. కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్‌కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన వినయ్ కృష్ణారెడ్డి (Vinay Krishnareddy) మంగళవారం బదిలీ అయిన విషయం తెలిసిందే.
