అక్షరటుడే, ఇందూరు : Government Hospital Inspection | ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Government Hospital Inspection | ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. సాధ్యమైనంతవరకు సాధారణ కాన్పులు చేయాలని, అత్యవసరమైతేనే సీ–సెక్షన్ చేయాలని తెలిపారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యులు, సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వార్డుల పరిశీలన..
అంతకుముందు ఆస్పత్రిలోని గైనిక్ వార్డు, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరును పేషంట్ల కేసు షీట్లను తనిఖీ చేశారు. ప్రతిరోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని.. మాతా శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయా.. తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా జీజీహెచ్లో అన్నిచోట్ల సీసీ కెమెరాలు నిరంతరంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ రాములు (Dr. Ramulu), జలగం తిరుపతిరావు (Jalagam Tirupati Rao) తదితరులున్నారు.