అక్షరటుడే, బోధన్/ఆర్మూర్: Municipal Nominations | మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. శుక్రవారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు (Nominations Centers) తరలివచ్చారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీల్లో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.
Municipal Nominations | బోధన్ మున్సిపాలిటీలో..
బోధన్ మున్సిపాలిటీ (Bodhan municipality) గాను 38 వార్డులు ఉండగా.. ఆ వార్డులకు గాను వివిధ పార్టీల నుంచి 342 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరిరోజు కావడంతో పత్రాలు సమర్పించేందుకు పోటీపడ్డారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి 112 అభ్యర్థులు నామినేషన్ వేయగా.. బీజేపీ నుంచి 43 మంది, ఎంఐఎం నుంచి 62 మంది పత్రాలు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి 90 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
Municipal Nominations | ఆర్మూర్లో 36వార్డులకు గాను..
ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో (Armoor municipal elections) భాగంగా శుక్రవారం చివరి రోజు 124 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటిరోజు 5 నామినేషన్లు దాఖలు కాగా.. రెండోరోజు 61 నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా 36 వార్డులకు గాను190 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థులతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ నాయకులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లను దాఖలు చేశారు.