అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad | రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవి దేవి (High Court Judge Justice T. Madhavi Devi) శనివారం బాసర వెళ్తూ.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆగారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్ద హైకోర్టు న్యాయమూర్తిని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలు అందించారు. అనంతరం వారితో హైకోర్టు న్యాయమూర్తి కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకు ముందు హైకోర్టు జడ్జి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.