అక్షరటుడే, ఇందూరు: Collector | నిజామాబాద్ (Nizamabad)కు చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి విభశ్రీని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు (Collector Rajiv Gandhi Hanumanth) అభినందించారు. విభశ్రీ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట కళానిలయంలో జరిగిన 40వ జాతీయస్థాయి నవరస శాస్త్రీయ సంగీత నాట్య పోటీల్లో పాల్గొని ప్రత్యేక జ్యూరీ నాట్య మయూరి అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ బుధవారం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విభశ్రీ తల్లిదండ్రులు విజయ్‌కుమార్, ప్రసన్న పాల్గొన్నారు.
