అక్షరటుడే, భీమ్‌గల్/కమ్మర్‌పల్లి: Nizamabad collector | జిల్లాలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సిరికొండ, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఏటీసీ సెంటర్లను సందర్శించి, వసతులు పరిశీలించారు.
సిరికొండ (Sirikonda) మండలం చీమన్‌పల్లిలో జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల (Jyotibapule Gurukul School) తరగతి గదులు, డార్మెటరీ, కిచెన్, టాయిలెట్స్ పరిశీలించారు. కిచెన్, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే ప్రాంగణంలో కొనసాగుతున్న జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి, వసతులపై అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్, భీమ్‌గల్ మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు అనుసంధానంగా నెలకొల్పిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను (Advanced Technology Center) సందర్శించారు.
కేంద్రాల్లో సదుపాయాలను పరిశీలించారు. భీమ్‌గల్ ఏటీసీ సెంటర్ తుది దశ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయించాలని, ఆయా కోర్సుల్లో పూర్తి స్థాయిలో ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో రాజ శ్రీనివాస్, ఆర్ఐ శరత్, ఎంపీవో సదాశివ్, ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏటీవో సంతోష్ సిబ్బంది ఉన్నారు.