అక్షరటుడే, ఆర్మూర్: Collector Nizamabad | నందిపేట మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ (Zilla Parishad High School), ప్రైమరీ పాఠశాల, పీహెచ్సీ (PHC), సహకార సంఘం ఎరువుల గోడౌన్, పశు వైద్యశాల, నర్సరీ, ఫైర్ స్టేషన్లను కలెక్టర్ సందర్శించారు.
పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ (Face recognition) విధానం (FRS) ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. నూటికి నూరు శాతం ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు అమలు కావాలని కలెక్టర్ ఆదేశించారు. హాజరును తప్పనిసరిగా పర్యవేక్షించాలని హెచ్ఎంలను ఆదేశించారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేసిన కలెక్టర్.. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (Amma Adarsha Patashala Committee) ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. టాయిలెట్స్, తాగునీటి వసతి వంటి సదుపాయాలు అవసరమైన పక్షంలో ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
Collector Nizamabad | ఔషధ నిల్వల తనిఖీ..
అంతకుముందు కలెక్టర్ నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెహెచ్సీ ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. కాన్పులు చేసేందుకు వీలుగా అన్ని వసతులు అందుబాటులో ఉన్నందున గర్భిణులు స్థానికంగానే ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్‌కు సూచించారు. హైరిస్క్ కేసులను సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేయాలని అన్నారు.
Collector Nizamabad | స్కానింగ్ సెంటర్లపై నిఘా..
అన్ని స్కానింగ్ సెంటర్ల పనితీరుపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాంటి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ వంద శాతం జరగాలని, డెంగీ, మలేరియా, అతిసారం, విషజ్వరాలు వంటివి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, టీబీ ముక్త్ భారత్ అభియాన్ పక్కాగా అమలు కావాలన్నారు. గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు.
Collector Nizamabad | ఎరువుల కొరత రానీయవద్దు
ఎరువుల గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ నిల్వలను పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే, ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాంబాబును, ఎరువుల గోడౌన్ నిర్వాహకుడు కార్తిక్‌ను ఆదేశించారు. అనంతరం పశు వైద్యశాలను సందర్శించారు. పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణ వంటి సేవలు అందిస్తున్నారా అని ఆరా తీశారు. సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాల పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు. వెటర్నరీ హాస్పిటల్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి పశు వైద్యాధికారి డాక్టర్ నితీశ్ వర్మ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
అలాగే ఫైర్స్టేషరన్ను సందర్శించారు. అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేలా సన్నద్ధమై ఉండాలని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నర్సింగ్రావును ఆదేశించారు. నూతనంగా నిర్మాణం అవుతున్న ఫైర్ స్టేషన్ భవనం తుది దశ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని సూచించారు. అక్కడి నుండి నర్సరీని సందర్శించిన కలెక్టర్, మొక్కలు ఆరోగ్యంగా ఉండడాన్ని గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీలో మిగిలి ఉన్న వివిధ రకాల మొక్కలను వేగంగా పంపిణీ చేస్తూ, వాటిని నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ రావును ఆదేశించారు.
Collector Nizamabad | భూభారతి దరఖాస్తులపై ఆరా..
తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యుల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు.. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలు తెలుసుకున్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తహశీల్దార్ సంతోష్‌ను కలెక్టర్ ఆదేశించారు.
అంతకుముందు ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో శ్రీనివాస్ రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి ఆరా తీశారు. ఈనెల 13న చేపట్టనున్న మార్కింగ్ మహా మేళాలో లబ్ధిదారులు అందరూ మార్కింగ్ పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. గ్రౌండింగ్ అయిన అనంతరం ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు.
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి