Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ఎడపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Collector Nizamabad | ఎడపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | బోధన్​ నియోజకవర్గంలోని (Bodhan Constituency) ఎడపల్లి (Yedapally) మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.. భూభారతి (Bhubarathi) రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. దరఖాస్తుల్లో ఆయా మాడ్యుల్స్​లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు.. ఎన్ని పెండింగ్​లో ఉన్నాయి.. ఎంతమందికి నోటీసులిచ్చారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్​ సూచించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ.. వేగంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్​ ఆదేశించారు.

Collector Nizamabad | స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​..

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) ప్రక్రియను చేపడుతున్న తీరును పరిశీలించి సూచనలు చేశారు. గడువు లోపు ఎస్ఐఆర్ (SIR) పూర్తి చేయాలన్నారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Housing Scheme) నిర్మాణాల ప్రగతి గురించి ఆరా తీశారు. లబ్ధిదారులందరూ నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

Must Read
Related News