Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | డిచ్​పల్లి, జక్రాన్​పల్లి మండలాల్లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు

Collector Nizamabad | డిచ్​పల్లి, జక్రాన్​పల్లి మండలాల్లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు

- Advertisement -

అక్షరటుడే,డిచ్​పల్లి: Collector Nizamabad | డిచ్​పల్లి (Dichpally), జక్రాన్​పల్లి (Jakranapally) మండలాల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

డిచ్​పల్లి మండలం నడి​పల్లి (Nadipally) గ్రామంలోని పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ జక్రాన్​పల్లి మండలం పడకల్ (padkal) గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోడౌన్​ను తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిలువ ఉన్న ఎరువులను పరిశీలించారు.

ఈ సీజన్​లో ఇంకా ఎంత మొత్తంలో యూరియా ఎరువుల అవసరం ఉందో ఆరాతీశారు. స్టాక్ కొంత మిగిలి ఉండగానే, ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి దేవికకు సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే వచ్చే యాసంగి సీజన్​కు సంబంధించి కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుండే ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలన్నారు.

కాగా.. పడకల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి కలెక్టర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాకేష్​ను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు అందరూ నిర్మాణాలు చేపట్టేలా క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ జరపాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.