Kanjara Gurukul | కంజర గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్​

అక్షరటుడే, ఇందూరు: Kanjara Gurukul | మోపాల్ మండలం (Mopal Mandal) కంజర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్​ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. Kanjara Gurukul | మధ్యాహ్న భోజనం పరిశీలన.. కలెక్టర్​ పాఠశాలలోని కిచెన్, డార్మెటరీ, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, మధ్యాహ్న భోజనాన్ని (Mid day Meals) పరిశీలించారు. స్టోర్​రూంలో నిల్వ ఉన్న బియ్యం, పప్పులు, వంట నూనె తదితర […]

అక్షరటుడే, ఇందూరు: Kanjara Gurukul | మోపాల్ మండలం (Mopal Mandal) కంజర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్​ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Kanjara Gurukul | మధ్యాహ్న భోజనం పరిశీలన..

కలెక్టర్​ పాఠశాలలోని కిచెన్, డార్మెటరీ, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, మధ్యాహ్న భోజనాన్ని (Mid day Meals) పరిశీలించారు. స్టోర్​రూంలో నిల్వ ఉన్న బియ్యం, పప్పులు, వంట నూనె తదితర సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్య స్థితిగతులు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు.

Kanjara Gurukul | విద్యార్థుల ద్వారా వివరాల సేకరణ

అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా.. అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా.. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Hyderabad Park Encroachments | పార్కుల క‌బ్జాపై హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Park Encroachments | హైదరాబాద్​లో అనేక పార్కు స్థలాలు కబ్జాలకు గురి అయ్యాయి. లే అవుట్​ వేసిన సమయంలో...

Telangana Cabinet Decisions | తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Cabinet Decisions | తెలంగాణ కేబినెట్​ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన...

MEO Bribery Case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MEO Bribery Case | లంచం తీసుకుంటూ ఓ ఎంఈవో ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం (Srikakulam)...

Star Health Insurance | దేశవ్యాప్తంగా 32 ‘ఆరోగ్య సేవా కేంద్రాలు’ ప్రారంభించిన స్టార్ హెల్త్.. ఉచితంగా వైద్య సేవలు

భారతదేశపు అగ్రగామి హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 'స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్', సామాజిక బాధ్యతలో భాగంగా సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసేందుకు శ్రీకారం చుట్టింది.