అక్షరటుడే, కామారెడ్డి: Collector Ashish Sangwan | కామారెడ్డి పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం తనిఖీ చేశారు. అమృత్ పథకంలో భాగంగా నిర్మాణం చేపడుతున్న పైప్లైన్ పనులు, కళాభారతి ఆడిటోరియం (Kalabharti Auditorium Kamareddy) పనులను సంబంధిత పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మున్సిపల్ కమిషనర్, మెగా సంస్థ వారితో కలిసి పర్యవేక్షించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Collector Ashish Sangwan | ప్రభుత్వ మెడికల్ కళాశాల..
అలాగే నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు (Government Medical College) నీటిలైన్ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద డ్రెయినేజీ పూడికతీతను పరిశీలించారు. అక్కడి నుంచి తీసిన వ్యర్ధాలను వెంటనే తొలగించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించి సిబ్బంది, విద్యార్థుల హాజరు పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈవో రాజు (Kamareddy DEO Raju), మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
