అక్షరటుడే, ఆర్మూర్: Armoor Congress | ఓటు చోరీకి (Vote Chori) వ్యతిరేకంగా మండలంలోని చేపూర్ (Chepur) గ్రామంలో మంగళవారం సంతకాల సేకరణ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి (Poddaturi Vinay Kumar Reddy) మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మండలంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో చేపూర్, పల్లె గ్రామాల అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, రాంసన్, మాజీ ఎంపీటీసీలు గంగాధర్, ఎల్క రంజిత్, సురేష్ రాజు, చిట్యాల పోశెట్టి, శాంతికుమార్, గంగసాయన్న, డి.రమేష్, దాసరి నాగరాజు, డి.సాయన్న, చరణ్, నితిన్, ఆర్మూర్ ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, పవన్ పండిట్, అయ్యప్ప శ్రీనివాస్, వెంకట్రాం రెడ్డి, అమృత రావు, శాల ప్రసాద్ పాల్గొన్నారు.
Armoor Congress | కాంగ్రెస్‌లో పలువురి చేరిక
ఆర్మూర్ మండలం ఫతేపూర్ (Fatehpur) గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ నుండి బండారి తిరుపతి, ప్రశాంత్, బీఆర్ఎస్ నుండి మామిడి చంద్రశేఖర్‌తో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కార్యక్రమంలో ఫతేపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలారి పోచన్న, ఆర్మూర్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రవీణ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు సునీల్ మట్ట, సంజీవ్ మట్ట, అజయ్, సాయి రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, గంగారం, దేవేందర్, గంగారెడ్డి, పెద్దోళ్ల సాయారెడ్డి, మట్ట భూమన్న తదితర నాయకులు పాల్గొన్నారు.
