అక్షరటుడే, ఇందూరు : Indiramma Houses |ఇందిరమ్మ ఇళ్ల Indiramma Houses పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి mla prashanth reddy ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైనా నిరుపేదలకు ఇళ్లు అందలేదని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి minister ponguleti srinivas reddy ఇప్పటికే నాలుగుసార్లు తేదీలను మార్చారని, ఒక ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. లక్షా ఎనభై వేల మంది దరఖాస్తు చేసుకుంటే, కేవలం 70 వేల మంది లిస్ట్ తయారు చేశారన్నారు. ఇల్లు ఉన్నవారి పేరు లిస్ట్‌లో పెట్టారని, గ్రామసభల్లో గొడవలు అయ్యాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు congress leaders ఎవరు పేరు చెప్తే లిస్టులో వాళ్ల పేర్లు మాత్రమే ఉన్నాయన్నారు. జీవో నెంబర్ 7 ప్రకారం లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారని తెలిపారు. కానీ అలా జరగడం లేదన్నారు. రూ.50 వేలు ఇచ్చిన వారి పేర్లు ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో ఉంటుందని ఆరోపించారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ కాంగ్రెస్ కోసం కష్టపడ్డ నాయకులకు ఈ పథకాలు అందాలని అనడం సిగ్గుచేటన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం Rajiv Yuva Vikasam Scheme కూడా డబ్బులు ఇచ్చిన వారికి వస్తున్నాయన్నారు. అలాగే వడ్ల కొనుగోలు ప్రక్రియ మందకోడిగా సాగుతుందని, దీంతో ఎక్కువ రోజులు ఆగితే తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద కంటే.. అందాల పోటీల మీద శ్రద్ధ ఎక్కువగా ఉందన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు, నాయకులు ప్రభాకర్, రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.
