34
అక్షరటుడే, బోధన్: Additional Collector Ankit | బోధన్ మున్సిపల్ పరిధిలో వందశాతం పన్నులను వసూలు చేయాలని మున్సిపల్ సిబ్బందికి అడిషనల్ కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) సూచించారు. బోధన్ మున్సిపాలిటీలో శుక్రవారం సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో (Sub-Collector Vikas Mahato) కలిసి ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై చర్చించారు. పన్ను వసూళ్లపై ఆరా తీశారు.
Additional Collector Ankit | ఇళ్ల నిర్మాణంలో జాప్యం వద్దు..
ఇందిరమ్మ ఇళ్ల (Indiramma house) నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పన్నులు ఎప్పటికప్పుడు వసూలు చేయాలని సూచించారు. తద్వారా పట్టణంలో అభివృద్ధిపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తదితరులు ఉన్నారు.