అక్షరటుడే, వెబ్డెస్క్ : Winter | రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకు వానలు దంచికొట్టగా.. రెండు రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది.
రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు (Temperatures) పడిపోయాయి. సాయంత్రం ఆరు కాగానే చలి ప్రారంభం అవుతోంది. ఉదయం 8 గంటల వరకు కూడా చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండ బాగానే ఉంటుంది. అయితే రాత్రి మాత్రం టెంపరేచర్ పడిపోతుంది.
Winter | ఆదిలాబాద్లో అత్యల్పం
చలిపెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)లోని బేలాలో అత్యల్పంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 14.7, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 14.8, శంకర్పల్లిలో 14.9, మొయినాబాద్లో 15, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 15, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 15.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రాజేంద్ర నగర్లో 15.3, బీహెచ్ఈఎల్ 15.5, మల్కాజ్గిరి 15.7, కుత్బుల్లాపూర్లో 15.7, గచ్చిబౌలిలో 15.9 డిగ్రీల టెంపర్ రికార్డ్ అయింది. కాగా నవంబర్లో ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Winter | జాగ్రత్తలు పాటించాలి
చలికాలం ప్రారంభం కావడంతో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలి ప్రభావంతో అనారోగ్యాల భారీన పడుతారు. వీరు రాత్రి పూట ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. అలాగే చలికాలం వచ్చిందంటే ఆస్తమా రోగులు గాలి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వీరు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. మధ్యాహ్నం పూట మాత్రమే బయటకు వెళ్లాలి.
