అక్షరటుడే, వెబ్డెస్క్:Monsoon | వాతావరణ శాఖ (Meteorological Department) రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. ఈ సారి మరింత ముందుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపింది.
సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఈ సారి మే 27నే తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ తొలుత ప్రకటించింది. అయితే రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో మే 24నే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ andaman nikobaar దీవుల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. దీంతో దీవుల్లో వారం రోజులుగా వర్షం పడుతోంది.
Monsoon | తెలంగాణలోకి అప్పుడే..
నైరుతి రుతుపవనాలు మే 24న కేరళ తీరాన్ని తాకనున్నాయి. జూన్ మొదటి వారంలోనే తెలంగాణ(Telangana)లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు(Rains) పడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఉందని హెచ్చరించింది.
కాగా.. తెలంగాణలో వారం రోజులుగా సాయంత్రం, రాత్రి పూట వర్షాలు పడుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దీంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది.