HomeUncategorizedCognizant Jobs | ఫ్రెష‌ర్స్‌కు కాగ్నిజెంట్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. 20 వేల మందిని నియమించుకోనున్న సంస్థ‌

Cognizant Jobs | ఫ్రెష‌ర్స్‌కు కాగ్నిజెంట్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. 20 వేల మందిని నియమించుకోనున్న సంస్థ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cognizant | అమెరికాకు చెందిన ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్‌(Cognizant) భారీ రిక్రూట్‌మెంట్‌కు తెరతీసింది. భారతదేశంలో అత్య‌ధిక ఉద్యోగులను కలిగి ఉన్న ఈ ఐటీ సంస్థ 2025లో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ప్ర‌ధానంగా మేనేజ్డ్ సర్వీసెస్, AI నేతృత్వంలోని సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం ఈ నియామ‌కాలు చేప‌ట్ట‌నుంది. గత త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.36 ల‌క్ష‌ల మంది ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో మ‌రిన్ని నియామ‌కాలు చేప‌ట్ట‌నుంది. “మేము ఇన్వెస్టర్ మీట్‌లో చెప్పిన‌ట్లుగానే 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటున్నామని.. ఇది గతేడాది చేప‌ట్టిన నియామ‌కాల సంఖ్య కంటే రెట్టింపు” అని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ cognizant CEO ravi kumar అన్నారు.

Cognizant | ఆఫ్‌షోర్ బెంచ్‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా..

భార‌త్‌లో అత్య‌ధికంగా ఉద్యోగుల‌ను క‌లిగిన ఉన్న కాగ్నిజెంట్ ఆఫ్‌షోర్ బెంచ్‌(Cognizant Offshore Bench)ను బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించింది. బలమైన వర్క్‌ఫోర్స్ పిరమిడ్‌(Workforce Pyramid)ను నిర్మించడానికి కంపెనీ చాలా మంది కొత్త గ్రాడ్యుయేట్‌లను (New graduates) నియమించుకోవాలని యోచిస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లుగా మేనేజ్డ్ సర్వీసెస్ ప్రాజెక్టులు (Managed Services Projects) పెరుగుతున్న క్ర‌మంలో ఆ స్థాయిలో నియామ‌కాలు చేప‌ట్టాల్సి వ‌స్తోంది.

కంపెనీ మూడు రంగాలపై దృష్టి సారించిందని సీఈవో కుమార్ తెలిపారు. ఫ్రెషర్లను నియమించుకోవడం, “AI ద్వారా ఉత్పాదకతను పెంచడం, మానవ మూలధన ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి వినియోగాన్ని మెరుగుపరచడం” అని ఆయ‌న వివరించారు. 14,000 మంది మాజీ ఉద్యోగులు సంస్థలో తిరిగి చేరారని, మరో 10,000 మంది బెంచ్‌లో ఉన్నారని తెలిపారు.

Cognizant | ఏఐ అభివృద్ధి కోసం..

కృత్రిమ మేధ(Artificial intelligence) విస్త‌రిస్తున్న త‌రుణంలో దానిపై సంస్థ దృష్టి పెట్టింది. “ప్రతిభను పెంచుకోవడంతో, AI యుగానికి అవసరమైన నైపుణ్యాలను బలోపేతం చేస్తున్నాము. సంస్థ ఉద్యోగుల్లో స్కిల్స్ పెంచ‌డంతో పాటు స్కేల్‌ను కూడా పెంచుతున్నాము, డిమాండ్‌ను వేగంగా తీర్చడానికి AIని విరివిగా ఉపయోగించుకుంటున్నాము” అని కుమార్ అన్నారు.