ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Cognizant New Campus | ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా..? కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్.. 8...

    Cognizant New Campus | ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా..? కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్.. 8 వేల ఉద్యోగాలు..!

    Published on

    అక్షరటుడే, అమరావతి: Cognizant New Campus : ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh) ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి (Visakhapatnam) మరో ప్రఖ్యాత ఐటీ కంపెనీ (IT company) రాబోతోంది. ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్‌ ముందుకొచ్చింది.

    రూ.1,582 కోట్ల పెట్టుబడితో 8 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు అక్కడ అధునాతన హంగులతో నూతన క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఫలితంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి స్థానికంగానే జాబ్స్ దొరకనున్నాయి.

    Cognizant New Campus : ఎకరాకు 99 పైసలే..

    విశాఖలో ఐటీ క్యాంపస్‌ (cognizant IT campus) ఏర్పాటుకు కాగ్నిజెంట్‌ పంపిన ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో తన కార్యకలాపాల కోసం 21.31 ఎకరాలు కావాలని కాగ్నిజెంట్‌ కోరిందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 8 వేల మందికి ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే కాగ్నిజెంట్‌ సంస్థకు ఎకరాకు 99 పైసల చొప్పున 21.31 ఎకరాలు కేటాయించాలని ఎస్‌ఐపీబీ తీర్మానించిందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు.

    Cognizant New Campus : 2029 నాటికి అందుబాటులోకి..

    వైజాగ్‌ (Vizag city) సిటీలోనే కాగ్నిజెంట్‌ తన కార్యకలాపాలను 2029 నుంచి ప్రారంభిస్తుందని లోకేశ్​ తెలిపారు. ఎప్పటి నుంచో కాగ్నిజెంట్‌ విశాఖపట్నం వస్తామని చెబుతుందని పేర్కొన్నారు. ఇప్పుడది సాకారమైందన్నారు. అయిదేళ్లలో 20 లక్షల యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యానికి చేరువయ్యేలా చేస్తున్న కృషి ఫలిస్తున్నట్లు మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

    More like this

    Bomb Threat | ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bomb Threat | బాంబు బెదిరింపు ఈమెయిల్స్ కారణంగా అత్యవసరంగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి...

    Yellareddy | కొట్టుకుపోయిన రైతుల కష్టం.. మళ్లీ తెగిన చెరువు కట్ట

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | చెరువు కట్ట తెగిపోయిందని.. ఫీడర్​ కాల్వలు కొట్టుకుపోయాయని మరమ్మతులు చేయాలని రైతులు గగ్గోలు...

    Supreme Court | కంగ‌నా ర‌నౌత్‌కు షాక్‌.. ఎంపీ పిటిష‌న్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | బీజేపీ ఎంపీ, సినీ న‌టి కంగనా ర‌నౌత్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది....