అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఆయన కామారెడ్డి (KamaReddy Constituency), ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో (YellaReddy Constituency) గురువారం పర్యటించనున్నారు.
హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ (Begumpet Airport) నుంచి ఉదయం 11 గంటలకు హెలీకాప్టర్లో బయలుదేరి 11.30కు లింగంపేట మండలం మోతె గ్రామానికి చేరుకుంటారు. ఇటీవల వరదల ధాటికి ధ్వంసమైన లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్దు ఆర్అండ్బీ వంతెనను పరిశీలించనున్నారు.
మధ్యాహ్నం 12:15 గంటలకు లింగంపేట (Lingampet) మండలంలోని బుడిగిద్దలో భారీవర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1:10 గంటలకు కామారెడ్డి పట్టణంలో వరదల్లో మునిగిపోయిన జీఆర్ కాలనీలో (GR Colony) సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడనున్నారు. 2:20 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.