అక్షరటుడే, వెబ్‌డెస్క్ :CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ(Delhi) పర్యటన ముగిసింది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆయన హైదరాబాద్ బయలుదేరనున్నారు. నూతన మంత్రుల శాఖల కేటాయింపుతో పాటు, పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్‌గాంధీ(Rahul Gandhi), కేసీ వేణుగోపాల్(KC Venugopal)తో సమావేశం అయ్యారు. ఈ మేరకు అధిష్టానం పీసీసీ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇయ్యడంతో 27 మందిని పీసీసీ ఉపాధ్యక్షులుగా 69 మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
CM Revanth Reddy | ఎవరి శాఖలు తొలగిస్తారో..
రాష్ట్రమంత్రి వర్గ విస్తరణ ఇటీవల చేపట్టిన విషయం తెలిసిందే. ముగ్గురు కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరికి ఏ శాఖలు కేటాయించాలనే అంశంపై ముఖ్యంత్రి అధిష్టానంతో చర్చించారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy), డిప్యూటీ సీఎం(Deputy CM) ఢిల్లీ వెళ్లి కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల వద్ద శాఖలను తొలగించి కొత్తవారికి కేటాయించనున్నారు. అయితే ఎవరి శాఖలు తొలగిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
CM Revanth Reddy | మారనున్న మంత్రుల శాఖలు
రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి 12 మంత్రులు ఉన్నారు. వీరిలో ముఖ్యమంత్రి వద్ద హోంశాఖ(Home Ministry), విద్యాశాఖ(Education Ministry) వంటి కీలక శాఖలు ఉన్నాయి. వీటితో పాటు మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ఎవరికి కేటాయించని శాఖలు ఆయనే వద్ద ఉన్నాయి. ఈ క్రమంలో సీఎం వద్ద ఉన్న కొన్ని శాఖల్లో కోత పెట్టనున్నట్లు సమాచారం. హోంశాఖ, విద్యాశాఖలో ఒకదానికి ఇతరులకు అప్పగించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కను అధిష్టానం ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం. మిగతా మంత్రులు కూడా రెండు పోర్ట్‌ఫోలియోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రుల శాఖల్లో మార్పులు చేపట్టనున్నట్లు తెలిసింది.