అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రూ.50 వేల కోట్ల విద్యుత్ కుంభకోణానికి రూపకల్పన చేశారన్నారు. ఇందులో 30 నుంచి 40 శాతం కమీషన్‌గా వెళ్తుందని ఆరోపించారు.
తెలంగాణ భవన్లో హరీశ్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడారు. రామగుండం, పాల్వంచ, మక్తల్‌లలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఆయన ఆరోపణలు చేశారు. ఎన్టీపీసీ (NTPC) తక్కవ ఖర్చుతో ప్లాంట్లను నిర్మించగలదని చెప్పారు. అయినా ప్రభుత్వం జెన్కోకు ఎందుకు అప్పగించిందని ప్రశ్నించారు. రామగుండం చాలా వరకు గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తయిందన్నారు. ఖర్చులు వాస్తవానికి తక్కువగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి గతంలో మార్కెట్లో యూనిట్‌కు రూ.5 చొప్పున విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చని, NTPC విద్యుత్ చాలా ఖరీదైనదని చెప్పారన్నారు. కానీ యూనిట్‌కు రూ.7.92–రూ.10 వరకు ఖర్చు అవుతోందని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. ఎన్టీపీసీ తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తామని లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
Harish Rao | బీఆర్ఎస్ హయాంలో..
బీఆర్ఎస్ (BRS) హయాంలో విద్యుత్ ప్లాంట్లను తక్కువ రేటులో నిర్మించినట్లు హరీశ్‌రావు తెలిపారు. యాదాద్రి ప్లాంట్ మెగావాట్‌కు రూ.7.5 కోట్ల చొప్పున, భద్రాద్రి ప్లాంట్‌కు మెగావాట్‌కు రూ.9.74 కోట్లు ఖర్చు అయిందన్నారు. ప్రస్తుతం ఎన్టీపీసీ 12.23 కోట్లకు మెగావాట్ చొప్పున నిర్మాణానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ మాత్రం రూ.14 కోట్ల నుంచి రూ.16 కోట్లకు ప్రతిపాదనలు చేసిందని ఆరోపించారు. 800 మెగావాట్ల కోసం కోసం రూ.5,600 కోట్లు, మూడు ప్లాంట్లపై రూ.15,000–20,000 కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పారు. ప్రభుత్వమే డబ్బు లేదని చెప్పినప్పుడు రాష్ట్రం 80శాతం రుణాన్ని మరియు 20శాతం ఈక్విటీని ఎలా సేకరిస్తుందని ప్రశ్నించారు.